- Advertisement -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శాసనసభలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఇంకా ఉన్నాయని స్పీకర్ తెలిపారు. నేటికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ముంబై నుంచి సాంకేతిక నిపుణులు వస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.


