Homeఆంధ్రప్రదేశ్ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ

ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ

- Advertisement -

ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నిర్ణీత ఫార్మెట్ లో తమ ప్రతిపాదనలను 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పంపాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.కాగా, కేబినెట్ భేటీలో ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలానే వివిధ కీలక అంశాలపై చర్చించి ఆమోదించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి మంత్రులకు సీఎం కీలక సూచనలు చేయనున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు