Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురం10 మంది గంజాయి ముఠా అరెస్టు

10 మంది గంజాయి ముఠా అరెస్టు

మత్తుపదార్థాల జోలికెళ్లి జీవితాలు నాశనం చేసుకోకండి

— జిల్లా ఎస్పీ పి. జగదీష్

విశాలాంధ్ర- అనంతపురం : మత్తుపదార్థాల జోలికెళ్లి జీవితాలు నాశనం చేసుకోకండి అని జిల్లా ఎస్పీ పి జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం గంజాయి అమ్ముతున్న ముఠాల దగ్గర్నుంచి 4,270 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు విలేకరుల సమావేశంలో తెలియజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొంత మంది యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని… క్షణకాలం ఆనందం కోసం నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దని సూచించారు. అనంత, పుట్టపర్తి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న పదిమంది ముఠాలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. . జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుందామని ఎవరైనా అమాయక ప్రజలు, యువకులు, విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కరాయ సముద్రం సి.ఐ కరుణాకర్, ఇన్ఛార్జీ సి.ఐ హేమంత్ కుమార్ , టాస్క్ ఫోర్స్ ఎస్సై రాజశేఖర్ రెడ్డిలకు రాబడిన పక్కా సమాచారంతో ఈ ముఠాను అరెస్టు చేసి 4,270 గ్రాముల గంజాయి, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవించినట్లు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా ఈ ముఠా సరఫరా చేస్తున్న గంజాయితో పాటు సేవించేందుకు ఖాళీ ఓసిలుమరియు మౌత్ ఫ్రెషనర్స్ మరియు కళ్లు ఎర్రబడకుండా ఉండేందుకు ఐ డ్రాప్స్ ను సీజ్ చేశారు.ఈ ముఠాలోని మైనర్ ను సి డబ్ల్యూ సి ముందు తీసుకురావడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజల్లో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. అక్రమ మాదకద్రవ్యాలు రవాణా చేసిన, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా గంజాయి మరియు మాదకద్రవ్యాలు పై సమాచారం ఉంటే వెంటనే ఈగల్ ట్రోల్ ప్రీ నెంబర్ 1972 కు లేదా స్ధానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు తెలియజేయాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు