Homeఆంధ్రప్రదేశ్భారత బాహుబలి…

భారత బాహుబలి…

- Advertisement -


–ఐఎఫ్‌ఆర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

విశాఖపట్నం: ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విశాఖ తీరానికి వచ్చింది. దీని విశిష్టతను నౌకాదళ అధికారులు మీడియాకు వివరించారు. లోపల విమానాలు భద్రపరిచే డెక్‌లు, ఆయుధ సంపత్తి, యుద్ధసమయంలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది, మిసైల్స్‌తో శత్రువులపై ఎలా దాడికి దిగుతుందో విశదీకరించారు. ‘మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పగలూ, రాత్రి విన్యాసాలు చేయడం దీని ప్రత్యేకత. గంటకు 28 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకేసారి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. చేతక్‌ హెలికాప్టర్లతో విన్యాసాలు చేయాల్సి వస్తే యుద్ధవిమానాల సంఖ్య తగ్గిస్తారు. విమానాలతో చేయాల్సి వస్తే హెలికాప్టర్ల సంఖ్య తగ్గుతుంది. రన్‌వేపై పది మిగ్‌ విమానాలను ఒకేసారి నిలపొచ్చు. అత్యంత వేగంగా వచ్చే జెట్‌ విమానాలు రన్‌ వేపై నిర్ణీత స్థానంలో నిలిచే వ్యవస్థ దీనిపై ఉంది. మిగ్‌ 29కే, లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్, చేతక్, ధ్రువ్, కమోవ్, సీకింగ్‌ హెలికాప్టర్లు దీనిపై విన్యాసాలు సాగిస్తాయి. నౌక కింది నుంచి ఫ్లైట్‌ ల్యాండింగ్‌ అయ్యేవరకు పది డెక్‌లు ఉండగా, ఆ పైన 8 ఉంటాయి. దీని రన్‌వే రెండు చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియాలను కలిపినంత విస్తీర్ణంలో ఉంటుంది. 2022లో ఈ నౌక కమిషన్‌ కాగా.. అంతకుముందు 2020లో ప్రాథమిక పరీక్షలు జరిపారు. 2021లో మొదటి ప్రయోగాత్మక పరీక్షలు చేశాక అధికారికంగా నౌకాదళానికి అంకితం చేశారు అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు