Homeజాతీయంవాషింగ్టన్‌ డీసీ మేయర్‌ పదవి రేసులో తమిళ మహిళ

వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ పదవి రేసులో తమిళ మహిళ

- Advertisement -

చెన్నై: తమిళ మూలాలున్న మహిళ అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ మేయర్‌ పదవికి పోటీపడుతున్నారు. తమిళనాడులోని తేని నగరానికి చెందిన రినీ సంపత్‌(31) తనకు ఏడేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి యూఎస్‌ వెళ్లారు. చదువంతా అక్కడే పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఏజెన్సీ నిర్వాహకురాలిగానూ సేవలందించారు. ఈ సమయంలోనే ఆమె వాషింగ్టన్‌ నగర సమస్యలపై గళమెత్తి. ప్రజలకు ఎంతో చేరువయ్యారు. ఆ అనుభవంతోనే నగర ఎన్నికల బరిలోకి దిగినట్లు ప్రకటించారు. నగరంలో మౌలిక వసతుల కల్పన, సత్వర ప్రజా సేవలు, వేగంగా స్పందించే కాల్‌సెంటర్లు అవసరమని గుర్తించి వాటిపై హామీలు ఇస్తున్నారు. జీవన ఖర్చు తగ్గించేలా ప్రభావవంతమైన చర్యలు చేపడతానంటున్నారు. ‘తాను రాజకీయ నాయకురాలిని కాదు. ఏ పార్టీ తన వెనుక లేదు. కొత్త వాషింగ్టన్‌ నిర్మాణమే లక్ష్యం్ణ అంటూ స్థానిక ప్రజలకు వివరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు