విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈనెల 26వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక షిరిడి సాయి దేవాలయంలో నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా చెక్కభజన, మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు స్వామి వార్లను ఊరేగించారు. ఈ సందర్భంగా పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు అర్చకులు మాట్లాడుతూ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా నూతన ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26వ తేదీ ఉదయం 3-45 గంటల నుండి 5-35 గంటల లోపు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఊరేగింపు
- Advertisement -


