Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం

కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం

- Advertisement -

ఇంచార్జ్ షాకే విజయకుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: భారత కృత్రిమ ప్రభావ సదస్సు 2026 ఘటనపై బహుజన సమాజ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి 20 మరియు 21 తేదీలలో నిర్వహించిన ఇండియా ఏ ఐ ఇంపాక్ట్ సుమ్మిట్ 2026 (భారత్ కృత్రిమ మేధస్సు ప్రభావ సదస్సు–2026) దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సదస్సు అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు పాల్గొని తమ సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడం, భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిందని తెలిపారు.అలాంటి అంతర్జాతీయ వేదికపై దేశ అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పూర్తిగా ఖండనీయం అని అన్నారు. దేశ పరువు ప్రతిష్టలను దెబ్బతీసే చర్యలు అర్ధనగ్న ప్రదర్శన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు. నిరసనలు తెలపడానికి చట్టబద్ధ మార్గాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవాన్ని అవమానించే విధంగా వ్యవహరించడం అసంగతమని స్పష్టం చేశారు.అదనంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరంగా మారుతున్నాయని విమర్శించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆ పార్టీని తిరస్కరించాలని పిలుపునిచ్చారు.దేశ ప్రయోజనాల కంటే రాజకీయ లాభనష్టాలను ముందుకు పెట్టే విధానం సరైంది కాదని విమర్శించారు.దేశ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి, యువత భవిష్యత్తు కోసం ప్రజలు చైతన్యంతో నిర్ణయం తీసుకోవాలని,దేశ ప్రయోజనాలను కాపాడే శక్తులకు మద్దతు ఇవ్వాలని వారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు