Homeక్రీడలుటీమిండియా నెగ్గాల్సిందే.!

టీమిండియా నెగ్గాల్సిందే.!

- Advertisement -

నేడు జింబాబ్వే తో సూపర్ -8 మ్యాచ్
చపాక్ స్టేడియం లో రాత్రి 7 నుంచి ప్రారంభం

చెన్నై : టి 20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో టీం ఇండియాకు కఠిన సవాల్ ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించింది. కానీ సూపర్ హిట్ లో పో భారీ ఓటమి జట్టును ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలోకి నెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ పేలవమైన పాము టీమిండియా ఆకు సమస్యగా మారింది. చావు రేవు తేల్చుకోవాల్సిన మ్యాచ్లో నేడు జింబాబ్వేను ఢీకొంటుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలుపుతోనే సరిపోదు… మెరుగైన నెట్ రన్ రేట్ తో విజయం సాధించాల్సిన పరిస్థితి. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో మంచి ప్రదర్శన చూపిస్తేనే ఆశించిన ఫలితం సాధ్యపడుతుంది. అప్పుడే సెమీస్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. చెన్నై లోని చపాక్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మ్యాచ్ కు ముందు ఇరుజట్లు సాధన తో సన్నద్ధమవుతున్నాయి.

భారత్‌ తన రెండో సూపర్‌ 8 మ్యాచ్‌లో గురువారం జింబాబ్వేపై గెలవడం కష్టమేమీ కాకపోవచ్చు. కానీ తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో భారీ పరాజయంతో నెట్‌ రన్‌రేట్‌ (-3.80) తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారీ విజయం సాధించడమే సవాల్‌. ఈ మ్యాచ్‌లోనే కాదు.. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే తన చివరి సూపర్‌ 8 (వెస్టిండీస్‌తో) పోరులోనూ టీమ్‌ఇండియా మంచి విజయం సాధించాల్సి ఉంది. 

విచ్ స్పిన్నర్లకు కలిసి రాలేదు…

మ్యాచ్‌ వేదిక చెపాక్‌ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం అదే అత్యుత్తమ బ్యాటింగ్‌ మైదానం. స్పిన్నర్లకు పెద్దగా కలిసి రాలేదు. పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వికెట్లు తీయడానికి, పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక్కడ అఫ్గానిస్థాన్‌పై 183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ కేవలం 17.5 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కూడా పిచ్‌ బ్యాటర్లకు సహకరించే అవకాశముంది. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

ఇరుజట్ల కూర్పు అంచనా…

భారత్‌: అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, దూబె, హార్దిక్, అక్షర్‌ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.

జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్‌ బర్ల్, సికందర్‌ రజా, మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎంగరవ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు