సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న టీడీపీ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) :ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్, సిద్దప్ప ధని అన్నారు. గురువారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో గ్రామ సర్పంచ్ బసమ్మ, శివ ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్జీఎస్ కింద మెటీరియల్ పనుల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్యం, అభివృద్ధి వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జానెడు సీసీ రోడ్డు గానీ, బీటీ రోడ్డు గానీ, మట్టి రోడ్డు గానీ వేయని వైసీపీ నాయకులు ఇప్పుడు భూమి పూజలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. అభివృద్ధి అంటే కూటమి అని, కూటమి అంటే అభివృద్ధి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో పరిపాలన సాగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, గ్రామ ఉప సర్పంచ్ కందనాతి మహేష్, నాయకులు చాకలి చంద్రశేఖర్, రవి, గోసలి తిక్కయ్య, జొల్లమ్మ రామాంజిని, బ్రహ్మయ్య, చిదానంద, విద్యాకమిటీ చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


