Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం కనేకల్ క్రాస్ వద్ద శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గురువారం తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాలలో హోమాలు, పూర్ణాహుతులు నిర్వహించి శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట, కళ్యాణోత్సవం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమం కలశాభిషేకం, మహామంగళహారతితో ముగిసింది. స్వామివారిని పుష్పాలతో, ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా అలంకరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి సేవలందించారు. స్థానిక ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులు భజనలు, నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. ఉరవకొండలో ఈ ప్రతిష్ట కార్యక్రమం భక్తులలో విశేష ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు