Homeవ్యాపారంవి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీతో టాటా మోటార్స్ ఒప్పందం

వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీతో టాటా మోటార్స్ ఒప్పందం

- Advertisement -

టుటికోరిన్: నికర సున్నా ఉద్గారాల దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో కీలకమైన అడుగుగా, భారత దేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, తమిళనాడులోని టుటికోరిన్లోని వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (వీఓసీపీఏ)తో 40 గ్రీన్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పవర్డ్ (హెచ్ 2 ఐస్) ప్రైమ్మూ వర్లను పోర్టులో మోహ రించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్స మక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం జరిగాయి. అవగాహన ఒప్పందంలో భాగంగా, టాటా మోటార్స్ హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రైమ్ మూవర్తో ట్రయల్స్ ను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాబోయే రెండేళ్లలో హెచ్2 ఐస్-శక్తితో నడిచే ప్రైమ్ మూవర్లను దశలవారీగా నియమిస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు