Homeజాతీయందుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్

దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్

- Advertisement -


న్యూదిల్లీ : రియల్ హీరో సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు రద్దయిన విషయం విధితమే. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటాననే విషయాన్ని మరొక్కసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఎటువంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు. ఇలాంటి సమయంలో మానవత్వం మాత్రమే ముఖ్యమని సోనూసూద్ అన్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారు తనకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే తన టీం వారిని సంప్రదిస్తుందన్నారు. కరోనా సమయంలో కూడా లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చిన ఆయన నేడు ఈ విపత్కర పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న ప్రయాణికులకు అండగా నిలుస్తున్నారు. ఆయన స్పందించి, చాటుకుంటున్న ఉదారతను నెట్టింట ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు