నర్సీపట్నం నియోజకవర్గ ట్రస్ట్ ఇన్చార్జ్ గంటా సూరిబాబు సారథ్యంలో నిర్వహణ
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం: ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన నర్సీపట్నం నియోజకవర్గ వాసులు భారీగా ట్రస్ట్‌లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో శారద నగర్ లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు(ఎం వి ఆర్) తనయుడు ట్రస్ట్ ప్రతినిధి ముత్యాల రాజేష్ బాబుకు నర్సీపట్నం ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీనిలో భాగంగా రాజేష్ బాబు పై పూలవర్షాలు కురిపిస్తూ, మందుగుండు వెలిగిస్తూ ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం,రాజేష్ బాబుకు శాలువా కప్పి చిరు సత్కారం నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సీపట్నం వాసులు మాట్లాడుతూ, ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయని, జిల్లా వాసుల శ్రేయస్సు కోసం ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలలో…పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యా ప్రోత్సాహం,ఆలయాల ఉత్సవాలు, పండగ కార్యక్రమాలకు విరాళాలు అందించడం,పేద కుటుంబాలకు అత్యవసర సమయంలో ఆర్థిక సాయం,అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులకు సహాయం,గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం,తీర్థయాత్రలకు భక్తుల కోసం బస్సుల సౌకర్యం కల్పించడం,పండుగల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, యువతకు ప్రోత్సాహకంగా క్రీడా మరియు సామాజిక కార్యక్రమాలకు సహకారం,విపత్తుల సమయంలో బాధితులకు సహాయక చర్యలు వంటి కార్య క్రమాలను చేపట్టడం వలన, మేమంతా ఎంతో ప్రేరణ పొందామన్నారు.అందుకే ఈ ట్రస్ట్‌లో సభ్యులుగా చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేమంతా కట్టుబడి పనిచేస్తామని నర్సీపట్నం వాసులు రాజేష్ బాబు కు తెలిపారు.ఈ ట్రస్ట్ సభ్యులుగా చేరే అవకాశం కల్పించినందుకు రాజేష్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామని తెలిపారు. దీనిలో భాగంగా రాజేష్ బాబు మాట్లాడుతూ,సమాజ సేవే మా చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని … మీ అందరి ఆశీస్సులే మా బలం అని అన్నారు.ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలతో ఎం.వి.ఆర్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారన్నారు. దీనిలో భాగంగా నేడు మిమ్మల్ని అందరిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉడతపల్లి జానకిరామ్, పెట్ల రవణమ్మ, రావి లత, గంట ఈశ్వరరావు, సిరిగిరి శెట్టి నానాజీ, మూర్తి , అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గైపూరి రాజు, చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ కడిమి వెంకట్ లతోపాటు స్థానికులు, ఎం వి ఆర్ అభిమానులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


