Homeఅంతర్జాతీయంమా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

- Advertisement -

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు.

‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై మావద్ద ప్రస్తుతం సమాచారం లేదు. కానీ మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపం. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు మా నుంచి తప్పించుకోలేరు. వారిని తరిమి, తరిమి అంతం చేస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోయినా.. మా టార్గెట్ మాత్రం మిస్ కాదు్ణ్ణ అని మీడియా అడిగిన ప్రశ్నకు డెఫ్రిన్ సమాధానమిచ్చారు.

మరోవైపు, దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను ఇరాన్‌ ఖండించింది. ‘‘ఇదొక కొత్తతరహా మానసిక యుద్ధం. ఇరాన్‌ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు్ణ్ణ అని రష్యాలో ఇరాన్‌ రాయబారి కాజెమ్‌ జలాలీ ‘ఎక్స్‌్ణ వేదికగా పేర్కొన్నారు.

ఇరాన్‌ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ అనుబంధ బసీజ్‌ మిలీషియా అధిపతి జనరల్‌ గులాం రెజా సాల్మనీ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న లారిజానీ మృతిని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఈ దాడి జరిగినప్పుడు ఆయన కుమార్తె ఇంటివద్ద ఉన్నారు. ఈ ఘటనలో ఆయనతో పాటు కుమారుడు, సహాయకులు ప్రాణాలు కోల్పోయారని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు