Homeసినిమామెగాస్టార్ నుంచి ఇక విద్యాసేవ?

మెగాస్టార్ నుంచి ఇక విద్యాసేవ?

- Advertisement -

త్వరలో అధికారిక ప్రకటన

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సామాజిక సేవలందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇక పేదలకు ఉచిత విద్యనందించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిరంజీవి ‘ఉచిత విద్యా ప్రాజెక్ట’ అంటూ ఇచ్చిన హింట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నేను రక్తదానాన్నే శ్వాసగా మార్చుకున్న తరుణంలో నన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళ నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన’ను ప్రారంభించారు. వందలాది మంది పేద విద్యార్థులను ఆయన చదివిస్తున్నారు. ఇప్పుడు అదే సూర్య నుంచి నేను స్ఫూర్తి పొందుతున్నాను. పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నాను” అని చిరంజీవి ప్రకటించారు. ఈ ఉచిత విద్యా కార్యక్రమం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఎక్కడ అవసరముంటే అక్కడ అండగా నిలవాలని ఆయన సంకల్పించారు. రక్తదానం ప్రాణాలను కాపాడితే… విద్య ఒక తరం భవిష్యత్తునే మారుస్తుందని మెగాస్టార్ నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన, విధివిధానాల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు