Homeజిల్లాలుశ్రీ సత్యసాయికార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు

కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన వన్ టౌన్ పోలీసులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ఎస్పీ సతీష్ కుమార్, ఇంచార్జ్ డిఎస్పి నర్సింగ్ అప్ప ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలోగల ఎర్రగుంట లో కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వీరితో పాటు వన్ టౌన్ ఎస్ఐ ఉమాదేవి, టూ టౌన్ ఎస్ఐ వీరేష్, సిబ్బంది ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఏ ఇంటిలో అయినా డ్రగ్స్, అనుమానిత వస్తువులు ఉన్నాయా అన్న కోణంలో సోదాలు నిర్వహించారు. అనంతరం సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణ లక్ష్యంగా తాము ఈ సోదాలు నిర్వహించామని, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల సరఫరాకు చెక్కు పెట్టే దిశగా కార్యచరణ చేపట్టామని తెలిపారు. గంజాయి, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, నాటు సారా విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం పాత నేరస్తులకు, రౌడీ షీటర్లతో మాట్లాడుతూ చట్టపరంగా జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, గొడవలకు దిగితే కఠిన చర్యలతో పాటు పట్టణ బహిష్కరణ ఉంటుందని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడితే డైల్ 100కు గాని, పోలీస్ స్టేషన్కు గాని వెంటనే సమాచారము ఇవ్వాలని తెలిపారు. ప్రజలందరూ కూడా చట్టానికి సహకరిస్తే సరి అయిన న్యాయంతో పాటు భద్రత కూడా ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే భద్రత, సరియైన న్యాయం చేకూర్చుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు