హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి రుచి చూపించింది. సొంత మైదానంలో యువ బౌలర్ల సత్తాను అభిమానులకు ప్రత్యక్షంగా చూపించారు. ఇంత వరకు జట్టులో బౌలింగ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. తమను నమ్మి అవకాశం ఇస్తే నిరూపించుకోవడానికి సిద్ధమని సన్‌రైజర్స్ యువ బౌలర్లు తమ ప్రదర్శనతో చెప్పారు. కొత్త కుర్రాళ్లు ప్రఫుల్ 4, సకిబ్ 4 వికెట్లు తీసి ఎసఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం యువ పేసర్లపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఈ విజయంతో మా ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం గెలుపు గురించి మాత్రమే కాకుండా, మా యువ బౌలర్ల సత్తా ఏంటో అందరికీ తెలిసింది. ఆశించిన ఫలితాన్ని అందించారు. స్వేచ్ఛగా ఆడి వారి ప్రణాళికలను సరిగ్గా అమలుచేస్తే ఫలితం సానుకూలంగా వస్తుందని తెలుసు. రాజస్థాన్‌పై అదే చేసి చూపించాం. ఈ ఘనత పూర్తిగా యువ బౌలర్లదే. ఈ ప్రదర్శనతో మా కుర్రాళ్లు ఎంత కసితో ఉన్నారో చూశాం. ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ అదరగొట్టారు. ఎప్ప్పుడెప్ప్పుడు ప్రధాన మ్యాచుల్లో ఆడాలనే వారి ఆకలికి ఇది నిదర్శనం. అందుకోసం చాలా కష్టపడ్డారు. మా బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్తో కలిసి శ్రమించారు. సీనియర్లతో మాట్లాడి ఎలా బౌలింగ్ చేయాలో మెలకువలు ఔపోశాన పట్టారు. ఈ మ్యాచ్‌లో మేం తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు’ అని ఇషాన్ తెలిపాడు.
మా కుర్రాళ్లు సత్తా చాటారు: ఇషాన్ కిషన్
- Advertisement -
RELATED ARTICLES


