Homeజిల్లాలుఅనంతపురంమాజీ ఉపసర్పంచ్ వన్నప్పను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

మాజీ ఉపసర్పంచ్ వన్నప్పను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ జి. వన్నప్ప అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వన్నప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు