. ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
. పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదు: తెహ్రాన్
. ఒప్పందానికి మÖడురోజులే గడువు: ట్రంప్
తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా`ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలపై తర్జనభర్జనలు జరుగుతున్న వేళ ఒప్పందం కుదుర్చుకోకుంటే చమురు పైపులైన్లు పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెహ్రాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సగ్‌హబ్ ఇస్ఫహానీ తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స’ వేదికగా హెచ్చరించారు. ‘ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఏ దాడి జరిగినా ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. అమెరికా ీVAర్మూజ్ దిగ్బంధనం ఫలితంగా చమురు క్షేత్రాలతో పాటు తమ దేశ మౌలిక సదుపాయల్లో దేనికైనా నష్టం జరిగితే సహించేది లేదని…అందుకు మద్దతు ఇచ్చే దేశాల్లోని అదే మౌలిక సదుపాయలకు నాలుగు రెట్ల నష్టం కలిస్తామని తెలిపారు. ‘మా లెక్కలు వేరు. ఒక చమురు బావి అంటే నాలుగు చములు బావులు’ అని ఇస్మాయిల్ తెలిపారు. కాగా, యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి ఇరాన్‌కు కేవలం 3రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యంకాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. మరోవైపు, అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చల అనిశ్చిత నేపథ్యంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని ఇరాన్ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ ప్రశ్నించారు. పాక్ సరైన మధ్యవర్తి కాదని, ఇస్లామాబాద్‌లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. ఇరాన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు రెజాయి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తమకు మంచి మిత్ర దేశమేనని, కానీ చర్చలకు సరైన మధ్యవర్తి కాదని రెజాయి అన్నారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాక్‌కు లేదని పేర్కొన్నారు. పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందని, కానీ ఆదేశ వైఖరిని సవాలు చేయడాన్ని అసలు సహించదని అన్నారు. లెబనాన్ విషయంలోనూ అమెరికా అంగీకరించలేని విధంగా డిమాండ్లను తెరపైకి తీసుకురాగా పాక్ నేతలు ఎవరూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలే కానీ, ఒకరివైపు ఉండటం సరికాదని తెలిపారు. చర్చల విషయంలో ఇప్పటివరకు పాకిస్థాన్ నేతలు చేసిన చర్యలు చూస్తే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
పాక్ పర్యటన విజయవంతం: అరాగ్చీ
రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న సమయంలో తన పాకిస్థాన్ పర్యటన విజయంవంతమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. పాక్ అత్యున్నత నాయకత్వంతో చర్చలు సానుకూలంగా జరిపినట్లు పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న రెండో దఫా చర్చలు ఏ దిశగా సాగాలి…ఏ పరిస్థితుల్లో కొనసాగాలి అనే అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్న తర్వాత ఆయన ఈ మేరకు వెల్లడించారు.
ట్రంప్‌కు ఎన్నికల భయం: ఇరాన్ పార్లమెంటు స్పీకర్
తమకు అన్ని ఆప్షన్లూ రెడీగా ఉన్నా యంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎంబీ ఘాలిబఫ్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ దగ్గర కూడా చాలా ఆప్షన్లే సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒక గణిత సమీకరణం ద్వారా ఈ విష యాన్ని ఎంబీ ఘాలిబఫ్ వివరించారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘వేసవి కాలంలో ముడి చమురు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ వేసవిలో ీVAర్మూజ్ జలసంధి మూసివేసి ఉంటే అమెరికాలో గ్యాస్ ధరలు చుక్కలను అంటుతాయి. అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు సమీపించిన వేళ ఇలా జరిగితే ట్రంప్‌కు ఇబ్బందే. దీనివల్ల విపక్ష డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేస్తారనే భయం ట్రంప్‌లో ఉందని ఎంబీ ఘాలిబఫ్ వ్యాఖ్యానించారు.


