Homeబెంగాల్‌లో రేపు పోలింగ్

బెంగాల్‌లో రేపు పోలింగ్

- Advertisement -

రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెర

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఫలితంగా రాజకీయ పార్టీల మైకులు మూగబో యాయి. చివరి వరకు ప్రధాన పార్టీలు ప్రచార సభలతో హోరెత్తించాయి. అనేక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఈనెల 29న రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మÖడు కోట్ల ఇరవై ఒక్క లక్షల డెబ్బై మÖడు వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం 41వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. అన్ని కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించింది. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్‌కతాలో 273 కంపెనీల బలగాలను మోహరించారు. ఈ విడతలో సీఎం మమత బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి అదే స్థానం నుంచి పోటీ చేస్తుండటంతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి 25 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బహరంపూర్ నుంచి ఆయన బరిలోకి దిగారు. ఈ నెల 23న 152 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. మే4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు