Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజడ్జిలు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేకూర్చాలి

జడ్జిలు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేకూర్చాలి

- Advertisement -

కక్షిదారులకు సత్వర న్యాయం చేకూర్చేందుకే ఈ కోర్టులు ఎంతో ఉపయోగం

అనంతపురం జిల్లా జడ్జి భీమారావు
విశాలాంధ్ర ధర్మవరం: కక్షిదారులకు ధర్మారంలో ఏర్పడిన రెండు కోర్టులు ఎంతగానో సత్వరమైన న్యాయం చేకూర్చుతుందని, ఈ నూతన కోర్టులకు విధులు నిర్వర్తించే జడ్జీలు అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజలకు సత్వరమైన న్యాయమును చేకూర్చాలని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని కోర్టులో హైకోర్టు ఆదేశాల మేరకు రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్), మూడవ అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్) గల గదులను రిబ్బన్ కట్ చేసి జిల్లా జడ్జి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కోర్టు ప్రాంగణంలో డిజిటల్ పద్ధతిలో హైకోర్టు జడ్జిలు లిసా గిల్, భానుమతి, సురేష్ రెడ్డి చెల్లా గుణరంజన్ ప్రారంభించారు. అనంతరం హైకోర్టు జడ్జీలు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు కోర్టుల వల్ల ప్రజలకు సత్వరమైన న్యాయం చేకూర్చుతుందని వారు తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం ధర్మవరం కోర్టు జడ్జీలకు హైకోర్టు జడ్జీలు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి న్యాయవాదులతో సమావేశాన్ని జిల్లా జడ్జి భీమారావు ఏర్పాటు చేసి, అనంతరం వారు మాట్లాడుతూ ఈ రెండు కోర్టులు చారితాత్మక గుర్తుండిపోయే విధంగా డ్యూటీషియల్ డిపార్ట్మెంట్లో ఒక శుభసూచకమైన రోజుగా, చరిత్రలో గొప్ప రోజుగా వారు కొనియాడారు. త్వరితగతిన తీర్పులకు ఒక చక్కటి అవకాశం కలదని, ప్రజా ఉపయోగానికి ఈ కోర్టులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కక్షిదారులుదారులకు న్యాయం చేసే విధంగా ఉండాలని తెలిపారు. తొలుత జిల్లా జడ్జి కు స్థానిక ధర్మవరం కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశులు, జూనియర్ సివిల్ జడ్జిలు వెంకట హరీష్, నందిని ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం పూజతో ప్రారంభమై ఘనంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ నందిని, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీష్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ సభ్యులతోపాటు సీనియర్,జూనియర్ న్యాయవాదులు, కోర్టు పరిధిలోని పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు