- Advertisement -
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


