Homeవిశ్లేషణరైతన్నకు ఉరి…కార్పొరేట్లకు పసిడి

రైతన్నకు ఉరి…కార్పొరేట్లకు పసిడి

- Advertisement -

భారతదేశ వ్యవసాయ రంగం, ప్రత్యేకించి పత్తి రైతాంగం నేడు అత్యంత తీవ్రమైన, భయానకమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అనేది కేవలం పాలకుల ఉపన్యాసాలకే పరిమితమై, బహుళజాతి కార్పొరేట్ సంస్థల అంతులేని లాభాల కోసం రైతుల జీవితాలను, వారి కష్టాన్ని బలిపీఠం bక్కిస్తున్న దారుణమైన వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ విధానాలు రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా, బేయర్మాన్‌శాంటో వంటి బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యాన్ని కాపాడేందుకే రేయింబవళ్లు పనిచేస్తున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రజా ధనంతో నడిచే ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థలను నిధుల లేమితో ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.35,000 కోట్ల మేర నిలువు దోపిడీకి కేంద్ర ప్రభుత్వం bర్రతివాచీ పరిచిందని గణాంకాలతో సహా స్పష్టమవుతోంది. ఇది కేవలం విధానపరమైన లోపం మాత్రమే కాదు, దేశంలోని సుమారు అరవై లక్షల పత్తి రైతు కుటుంబాలపై ప్రభుత్వమే దగ్గరుండి చేస్తున్న ఒక ‘క్రిమినల్ కుట్ర’ అనేది నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. ప్రస్తుతం భారతీయ పత్తి విత్తన మార్కెట్ విలువ రూ.7,500 కోట్లుగా ఉంది. ఇది 2030 నాటికి ఏకంగా రూ.10,000 కోట్లకు చేరుకోనుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మార్కెట్ అంతా పూర్తిగా పైవేట్ సంస్థల గుప్పిట్లోనే బందీ అయి ఉంది. 2002లో బీటీ పత్తి ప్రవేశపెట్టినప్పటి నుండి నేటి వరకు పైవేట్ విత్తన పరిశ్రమ పత్తి రైతుల జేబులకు చిల్లులు పెట్టి సుమారు రూ.35,000 కోట్లను లాగేసుకుంది. కేవలం ఒక కిలోకు రూ.500 నుండి రూ.550 వరకు మాత్రమే ఉత్పత్తి వ్యయం అయ్యే ఈ పత్తి విత్తనాలను, ఏకంగా నాలుగు రెట్లు లాభంతో కిలో రూ.2,000కు అమ్ముతుండటం పచ్చి కార్పొరేట్ దోపిడీ కాక మరేమిటి? 202526 సంవత్సరానికి గాను బీజీ2 విత్తనాల ప్యాకెట్ ధరను రూ.901కి పెంచారు. అంటే కేవలం గడిచిన నాలుగేళ్లలోనే విత్తనాల ధర ఏకంగా 18.5 శాతం మేర పెరిగింది. ఫలితంగా రైతులపై ఏటా రూ.6,000 కోట్లకు పైగా అదనపు ‘విత్తన పన్ను’ భారం పడుతోంది. ఒకవైపు విత్తనాలు, bరువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. మరోవైపు పత్తి మద్దతు ధర మాత్రం పాతాళానికి పడిపోతోంది. నిన్నమొన్నటి వరకు క్వింటాలుకు రూ.11,000 పలకాల్సిన పత్తి ధర, నేడు అమాంతం పడిపోయి కేవలం రూ.7,200 నుండి రూ.8,200ల మధ్య ఊగిసలాడుతుండటం రైతుల పాలిట పెనుశాపంగా మారింది. ఇన్‌పుట్ ఖర్చులు రికార్డు స్థాయిలో హెక్టారుకు రూ.60,000కు పెరిగిపోయాయి. ఒక్క బీటీ పత్తిలో కలుపు నివారణకే bకరానికి రూ.20వేల వరకు ఖర్చవుతోందంటే రైతుల ఆర్థిక పరిస్థితి bంత దయనీయంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులు విపరీతంగా పెరిగినా, దిగుబడి ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే అదీ శూన్యమే. 201718 వ్యవసాయ సంవత్సరంలో 370 లక్షల బేళ్లుగా ఉన్న మన దేశ పత్తి ఉత్పత్తి, 202425 నాటికి అత్యంత దారుణంగా ఏడేళ్ల కనిష్ట స్థాయికి, అంటే కేవలం 295 లక్షల బేళ్లకు పడిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో మన ఉత్పాదకతను పోల్చి చూస్తే తలదించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పొరుగున ఉన్న చైనాలో హెక్టారుకు రికార్డు స్థాయిలో 2,170 కిలోల దిగుబడి వస్తుండగా, ప్రపంచ సగటు 769 కిలోలుగా నమోదైంది. కానీ మన దేశంలో మాత్రం అది కేవలం 465 కిలోలకే పరిమితమైంది. విస్మయకరమైన వాస్తవం ఏమిటంటే, ఈ దిగుబడి విషయంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కంటే కూడా భారతదేశం వెనుకబడిపోయి అధమ స్థానంలో నిలిచింది. పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవ్వడం, ఆశించిన దిగుబడి రాకపోవడం, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్ప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న bనిమిది జిల్లాల్లోనే 202526 తొలి తైమాసికంలో ఏకంగా 269 మంది పత్తి రైతులు ఉరికొయ్యలకు వేలాడారు. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 32 శాతం పెరుగుదల కావడం అత్యంత ఆందోళనకరం. నేడు మహారాష్ట్రలో సగటున రోజుకు bనిమిది మంది రైతులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. విదర్భ, మరాఠ్వాడాలలో జరుగుతున్న ప్రతి ఒక్క రైతు ఆత్మహత్యకు ఈ ప్రభుత్వ వ్యవసాయ విధానాల వైఫల్యమే ప్రత్యక్ష కారణమన్నది కఠోరమైన సత్యం. ప్రజా పరిశోధనలను గాలికి వదిలేసి, బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యాన్ని పెంచి పోషిస్తున్న పాలకుల చేతులకు రైతుల రక్తం అంటకుండా ఉంటుందా?
మన దేశీయ వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రతిభ, సత్తా లేదా అంటే, పుష్కలంగా ఉంది. కానీ వారి అద్భుతమైన పరిశోధనలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే bన్నో అద్భుతమైన బీటీ పత్తి వంగడాలను అభివృద్ధి చేశాయి. జూన్ 2025లో పర్భానీలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్, భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్ బీజీ2 స్ట్రెయిట్ రకాలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. వీటికి జీఈఏసీ సెంట్రల్ వెరైటీ ఐడెంటిఫికేషన్ కమిటీ అనుమతి కూడా లభించింది. ఈ దేశీయ విత్తనాల ద్వారా హెక్టారుకు 1819 క్వింటాళ్ల భారీ దిగుబడి రావడమే కాకుండా, రైతులు తమ విత్తనాలను తామే నిల్వ చేసుకుని 23 సీజన్ల పాటు తిరిగి వాడుకోవచ్చు. దీనితో రైతులపై విత్తనాల కోసం ఏటా పెట్టే ఖర్చు భారం తప్ప్పుతుంది. అలాగే, ఐసీఏఆర్సీఐసీఆర్‌కి చెందిన ఒక రకం విత్తనాలను కూడా వర్షాధార పరిస్థితుల్లో సైతం హెక్టారుకు 2,639 కిలోల దిగుబడిని సాధించి తన అద్భుత సామర్థ్యాన్ని చాటింది. ఇన్ని అద్భుతమైన, చవకైన వంగడాలు మన కళ్లెదుటే అందుబాటులో ఉన్నప్పటికీ, అవి రైతుల చేతికి చేరకుండా దశాబ్దాలుగా ప్రభుత్వమే వ్యవస్థాగతంగా అడ్డుకుంటోందన్నది ప్రధాన ఆరోపణ. దీనికి ప్రధాన కారణం పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ‘జెనెటిక్ ఇంజనీరిం>ù అపైజల్ కమిటీ’ (జీఈఏసీ). ఇది ఒక శాస్తీయ నియంత్రణ సంస్థలా కాకుండా, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడే ‘కార్పొరేట్ టోల్ గేట’లా వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి.
బహుళజాతి సంస్థలు తీసుకొచ్చే పైవేట్ హైబ్రిడ్ విత్తనాలకు వెనువెంటనే ఆమోదముద్ర వేసే ఈ సంస్థ, ప్రభుత్వ వంగడాల ఫైళ్లను మాత్రం ఏళ్ల తరబడి బూజుపట్టేలా చేస్తోంది. ఈ దయనీయ స్థితికి ముగింపు పలకాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రభుత్వ స్ట్రెయిట్ బీటీ పత్తి రకాలన్నింటినీ రాబోయే సీజన్లో కనీసం 10 లక్షల హెక్టార్లలో సాగు చేసేలా దేశవ్యాప్తంగా తక్షణమే విడుదల చేయాలి. ఈ పబ్లిక్ స్ట్రెయిట్ రకాలను “నేషనల్ పబ్లిక్ గూడ్స” (జాతీయ ప్రజా ఆస్తులు) గా ప్రకటించి, పంపిణీ ఖర్చులను ప్రభుత్వమే భరించి రైతులకు కిలో గరిష్టంగా రూ.200కే అందుబాటులో ఉంచాలి. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు ఉద్దేశించిన రూ.5,000 కోట్ల ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’ కి తక్షణమే క్యాబినెట్ ఆమోదం తెలిపి, ఆ నిధులను ఐసీఏఆర్ కు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు తప్పనిసరిగా అందించాలి. బహుళజాతి విత్తన సంస్థలు సాగిస్తున్న పోటీ నిరోధక, గుత్తాధిపత్య అక్రమ వ్యాపార పద్ధతులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమగ్ర దర్యాప్తు జరపాలి. భారతీయ రైతులకు తమ సొంత విత్తనాన్ని తామే కాపాడుకునే ప్రాథమిక హక్కు, అత్యంత సరసమైన ధరకే నూతన సాంకేతికతను పొందే హక్కు, అన్నిటికంటే ముఖ్యంగా అప్ప్పుల బాధ లేకుండా ఆత్మాభిమానంతో బతికే హక్కు ఉంది. ఆ హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికీ, ఏ బహుళజాతి సంస్థకూ bప్పటికీ లేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు