Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఐ డి ఎఫ్ సి బ్యాంకు ఏటీఎం మిషన్ దొంగలించిన దొంగలు

ఐ డి ఎఫ్ సి బ్యాంకు ఏటీఎం మిషన్ దొంగలించిన దొంగలు

- Advertisement -

ధర్మవరంలో రెచ్చిపోయిన దొంగలు

ఆరు టీములను ఏర్పాటు చేసిన డిఎస్పి నర్సింగప్ప

సంఘటన స్థలాన్ని ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలన

పట్టణంలోని పుట్టపర్తి రోడ్ బాగానగల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుండి 4 గంటల లోపు నలుగురు దుండగులు పక్కా ప్రణాళికతో ఏటీఎం మిషన్ గుణపముతో కొట్టి, తదుపరి ఏటీఎం మిషన్ ను ఏకంగా త్రాడుతో బోలోరా వాహనములో వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో, ఎస్సై ఉమాదేవి తో పాటు సిబ్బంది అక్కడకు చేరుకొని జరిగిన ఘటనను పరిశీలించారు. మొత్తంగా ఏటీఎం గాజు వాకిలిని కూడా పడగొట్టి సినీ పక్కిలో దొంగతనం చేశారు. అనంతరం సిఐ నాగేంద్రప్రసాద్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ కు సమాచారం ఇవ్వడంతో, మేనేజర్ అక్కడ చేరుకొని పరిస్థితిని గమనించారు. తదుపరి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు డిఎస్పి నర్సింగప్ప ఏటీఎం వద్దకు చేరుకొని పరిశీలించారు. అనంతరం మేనేజర్ లోక్నాథ్ మాట్లాడుతూ ఏటీఎం మిషన్ లో 7 లక్షల నుండి 10 లక్షల లోపు నగదు ఉందని వారు స్పష్టం చేశారు. తదుపరి ఏటీఎం లో గల సీసీ కెమెరాలు ఆధారంగా వన్ టౌన్ పోలీసులు నలుగురు దొంగలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. పక్కా ప్రణాళికతో తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగిందని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సిఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరు టీములను ఏర్పాటు చేసి ఆ దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఏటీఎం దొంగలను త్వరలోనే పట్టుకొని అరెస్టు చేస్తామని సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలోనే ఏటీఎంల దోపిడీ జరగడంతో, తిరిగి ధర్మవరంలో ఇటువంటివి చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఎస్ఐ ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు