ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; నేడు పట్టణములో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ విభాగం వారు కాలేజీ సర్కిల్ వద్ద ప్రయాణికులకు అవసరమైన చల్లటి తాగునీరు కొరకు చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ సర్కిల్ వాజ్పేయి విగ్రహం వద్ద ప్రతిరోజు ప్రయాణికుల కొరకు ఉచిత మంచినీటి సౌకర్యమును కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చలివేంద్రం వల్ల ప్రజల యొక్క దాహార్తి తీరుతుందని తెలిపారు. అంతేకాకుండా బస్సులు కోసం నిరీక్షణ కొరకు తాగునీరు కొరకు వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్న చలివేంద్రమును ఉపయోగించుకోవడం వలన దాహార్తి తీరుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
కాలేజీ సర్కిల్ వద్ద ఆర్టీసీ వారు చలివేంద్రం ఏర్పాటు..
- Advertisement -
RELATED ARTICLES


