Homeజిల్లాలుఅనంతపురంపరీక్షలకు ఉచిత శిక్షణ..ఆంధ్రప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, అనంతపురము సంచాలకులు

పరీక్షలకు ఉచిత శిక్షణ..ఆంధ్రప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, అనంతపురము సంచాలకులు

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విజయవాడ వారి ఆదేశాల మేరకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్-డి మరియు ఏ.పి. హైకోర్టు-2026 పరీక్షలకు అర్హులైన ఉమ్మడి అనంతపురము జిల్లాకు చెందిన బి.సి., యస్.సి., మరియు యస్.టి. అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వికరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బి.సీ. స్టడీ సర్కిల్, అనంతపురము సంచాలకులు ఖుష్బూ కొఠారి బుధవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ లోగా ఆంధ్రప్రదేశ్ బి.సీ స్టడీ సర్కిల్, అనంతపురము కార్యాలయము నందు దరఖాస్తు చేసుకోవలెనని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…100 మంది అభ్యర్థులకు ఇందులో బి.సిలకు 66%, యస్.సిలకు 20%, యస్.టిలకు 14% ప్రకారము సీట్లు కేటాయించబడి,. ఈ శిక్షణ 2 నెలల పాటు ఉచిత శిక్షణ తో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్-డి మరియు ఏ.పి. హైకోర్టు-2026 పరిక్షలకు సంబంధించి ఆన్ లైన్ నందు అప్లై చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులని, అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీ పరీక్షలలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్-డి మరియు ఏ.పి. హైకోర్టు-2026 శిక్షణకు దరఖాస్తు చేయు అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పదవ తరగతి మార్కు లిస్టు మరియు డిగ్రీ మార్కు లిస్టు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (ఇటీవల జారీచేసిన) (తల్లిదండ్రుల వార్షిక అధాయము రూ.1,00,000/- లోపు మాత్రమే), ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్-డి మరియు ఏ.పి. హైకోర్టు-2026 పరిక్షలకు సంబంధించి ఆన్ లైన్ నందు అప్లై చేసిన నకలును జతపరచి ఈ నెల 20వ తేదీ లోగా ఆంధ్రప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్, జిల్లా కలెక్టరు వారి కార్యాలయము దగ్గర, పెన్నార్ భవన్ ప్రక్కన, అనంతపురము కార్యాలయము నందు మీ దరఖాస్తులు అందజేయవలెను.
మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయములో గాని, ఫోన్ నెంబర్లు 9704204905, 9550250770, 8309006875 నందు సంప్రదించగలరని అనంతపురము బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు శ్రీమతి ఖుష్బూ కొఠారి తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు