1.3 కోట్ల మందికి పకడ్బందీగా పరీక్షలు
బీజింగ్: జనాభాలో మన కంటే ఎక్కువగా ఉన్న చైనాలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామక పరీక్షలు కఠినతరంగా ఉంటాయి. చైనాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉన్నత విద్యాప్రవేశ పరీక్ష (గావోకావో) ప్రతి ఏటా జూన్‌లో నిర్వహిస్తారు. పరీక్షకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం, లీక్ చేస్తే కఠన చర్యలు తీసుకుంటారు. లీకులకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. చైనాలో నిర్వహిస్తున్న ‘గావోకావో’ పరీక్ష 1.3 కోట్ల మంది రాస్తున్నారు. దేశవ్యాప్త జాతీయ కళాశాలల ప్రవేశ పరీక్ష గావోకావో విజయవంతంగా సాగుతోంది. అక్కడ వ్యవస్థలో, నిర్వహణలో లోపాలు కనిపించవు. మన దేశంలో దాదాపు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకై విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కట్టుదిట్టంగా పరీక్షలు…
పరీక్ష జరిగే సమయంలో ఆయా కేంద్రాల గగనతలంలో విమానాలను దారి మళ్లిస్తారు. డ్రోన్లు, కృత్రిమ మేధతో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. గావోకావో ప్రశ్నపత్రాలను జాతీయ రహస్య పత్రాలుగా భావిస్తారు. అత్యంత కఠిన సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటిస్తారు. ప్రశ్న పత్రాలను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలిస్తారు. 24 గంటల నిఘా ఉండే జైళ్లలో వాటిని ముద్రిస్తారు. ఖైదీలు బయటకు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి లీక్‌కు అవకాశం లేదనేది చైనా అంచనా. ముద్రించిన ప్రశ్న పత్రాలను పోలీసు భద్రతతో జీపీఎస్ ట్రాకింగ్, వీడియో పర్యవేక్షణ, పలు అంచెల భద్రతా స్టోరేజ్‌ల మధ్య తరలిస్తారు. గావోకావో పరీక్ష జరిగే రోజు చైనాలో అసాధారణంగా ఉంటుంది. యాంటీ చీటింగ్ నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది. పరీక్షా కేంద్రాలవద్ద మెటల్ డిటెక్టర్లు, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ గేట్లు, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లను గుర్తించే పరికరాలు ఏర్పాటు చేస్తారు. పరీక్షకు ముందు చైనా ప్రభుత్వం… ఫేక్ ఆన్సర్ స్కామ్‌లు, ఆన్‌లెనన్ రూమర్లు, ఆర్గనైజ్డ్ చీటింగ్ నెట్‌వర్క్‌లను ఛేదిస్తుంది.
కఠిన చట్టాలు, సాంకేతిక నిఘా, జాతీయ స్థాయి భద్రతా ప్రొటోకాల్ వంటివి చైనాలో ప్రశ్న పత్రం లీకులకు ఆస్కారం లేకుండా చేస్తాయి.
చైనాలో ‘లీకు’లుండవ్!
- Advertisement -
RELATED ARTICLES


