Homeజాతీయంహోర్మూజ్‌ను దాటి…భారత్‌కు వస్తోన్న ఎల్‌పీజీ ట్యాంకర్

హోర్మూజ్‌ను దాటి…భారత్‌కు వస్తోన్న ఎల్‌పీజీ ట్యాంకర్

- Advertisement -


న్యూదిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసజడిని రేపుతోంది. ముఖ్యంగా గ్యాస్, ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం మన దేశంపై తీవ్రంగా చూపుతోంది. ఇంధన కొరతతో దేశంలో నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హోర్మూజ్ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఎంవీ సన్‌షైన్ అనే నౌక సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు భారత నౌకాదళంతో సహా పలు ఏజెన్సీలు సహకారం అందిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ నౌకతో కలిపి 15 ఎల్పీజీ నౌకలు సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు వెల్లడించాయి. అయితే, ఇది ఎన్ని టన్నుల ఎల్పీజీతో వస్తుంది, భారత్‌కు ఎప్ప్పుడు చేరుకుంటుందన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. శాంతి నెలకొన్న తర్వాత హోర్మూజ్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయని ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉపవిదేశాంగ మంత్రి కాజమ్ ఘరీబబాదీ పేర్కొన్నారు. దౌత్యంపై అమెరికా నిబద్ధతతో లేదని విమర్శించారు. తాము అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించడం లేదని, శాంతి నెలకొన్న తర్వాత మునపటి కంటే ఎక్కువ భద్రత ఉంటుందని తెలిపారు. ఒక వైపు చర్చలు అంటూ కాలపయాపన చేస్తూ అమెరికా హోర్మూజ్‌ను దిగ్బంధించడం, దీన్ని ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు