నేడు ముంబైతో అమీతుమీ
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇప్ప్పుడు ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఇదీ ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. ఆ జట్టు నేడు (గురువారం)ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఆసక్తికరం. బౌలింగ్‌లో లోపాలున్నా బలమైన బ్యాటింగ్ వల్ల టోర్నీ ప్రారంభంలో పంజాబ్ నెగ్గుకొచ్చింది. కానీ దిల్లీపై మంచి స్కోరే చేసినా పంజాబ్‌కు అది సరిపోలేదు. చివరి అయిదు ఓవర్లలో పేసర్ల పేలవ బౌలింగ్‌తో ఆ జట్టు దెబ్బతింది. ఈ ఐపీఎల్‌లో అన్ని జట్లలో అత్యంత పేలవ ఎకానమీ ఉన్న పేస్ దళం అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్‌దే. ఈ మ్యాచ్‌తోనైనా పేసర్లు పుంజుకుంటారని పంజాబ్ ఆశిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ తిరిగి పరుగుల బాట పట్టాల్సివుంది. పంజాబ్ క్యాచింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగా మెరుగుపడాలి. మరోవైపు ఈ టోర్నీలో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన పేలవం. 8 పరాజయాలతో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఇక కోల్పోయేదేమీ లేని స్థితిలో ఆ జట్టు స్వేచ్ఛగా ఆడే అవకాశముంది. అది పంజాబ్‌కు ప్రమాదమే.
పంజాబ్ కింగ్స్ పుంజుకునేనా?
- Advertisement -
RELATED ARTICLES


