పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూదిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రో వడ్డన తప్పదనే ఊహాగాలు నిజమైనాయి. అనుకున్నంత పనే జరిగింది. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మÖలిగే నక్కపై తాటికాయి పడ్డ చందంగా ఇప్ప్పుడు పెట్రోల్ ధరలు ప్రజల నెత్తిన పడ్డాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజల్‌పై సగటున రూ.3 చొప్ప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం నేపథ్యంలో… ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ… ప్రభుత్వరంగ చమరు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. తీవ్ర ఆర్థికఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో… లీటరుకు రూ.3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 చొప్ప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే, సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్ప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన ధరలు ఇలా…
రాష్ట్రంలో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14, తెలంగాణలో…పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్ప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని దిల్లీలో రూ.97.77 (ం3.00), కోల్‌కతాలో 108.74 (ం3.29), ముంబైలో 106.68 (ం3.14), చెన్నైలో 103.67 (ం2.83)గా ఉండనున్నాయి. విజయవాడలో పెట్రోల్ ధర రూ.109.63. ఇక డీజిల్ ధరలు…దిల్లీలో 90.67 (ం3.00), కోల్‌కతాలో 95.13 (ం3.11), ముంబైలో 93.14 (ం3.11), చెన్నైలో 95.25 (ం2.86)గా ఉండనున్నాయి.
ప్రజల నెత్తిపై ‘పెట్రో ‘ వడ్డన
- Advertisement -
RELATED ARTICLES


