Homeజాతీయంరాహుల్ ఆస్తుల ఆరోపణలపై విచారణ

రాహుల్ ఆస్తుల ఆరోపణలపై విచారణ

- Advertisement -


సీబీఐ, ఈడీలకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం
లఖ్‌నవూ:
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను విచారించాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను(ఈడీ) అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ ధర్మాసనం ఆదేశించింది. దీనిపై జులై 20వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని సూచించింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ జఫీర్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం 12న రహస్య విచారణ జరిపింది. విచారణ వివరాలు హైకోర్టు వెబ్‌సైట్‌లో గురువారం అందుబాటులోకి వచ్చాయి. ‘ఒకవేళ పిటిషనర్ ఫిర్యాదు అంది ఉంటే ఆరోపణలను చట్ట ప్రకారం పరిశీలించాల్సిందే. చట్టం అనుమతించే చర్యలను సీబీఐ, ఈడీ చేపట్టవచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర సిబ్బంది శిక్షణశాఖను, రెవెన్యూ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను, తీవ్ర మోసాల విచారణ కార్యాలయ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. పిటిషనర్ చేసిన ఫిర్యాదు తమకు అందిందని, దానిపై తమ స్పందనను కోర్టుకు తెలియజేస్తామని సీబీఐ, ఈడీలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు