హైదరాబాద్: కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు. హైదరాబాద్‌లో పుట్టిన తబస్సు ఫాతిమా హష్మి ‘టబు’గా చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. హిందీలో బాల నటిగా తెరంగ్రేట్రం చేసిన టబు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఎప్ప్పుడూ చెప్పకూడదని, డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్ప్పుకోమని చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. అందుకే నాకు కథ నచ్చకపోతే…నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తా. అదే నా పద్ధతి’ అని చెప్ప్పుకొచ్చింది టబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ… సినీరంగంలో హీరోయిన్‌ల వయసుపై విమర్శలు రావడం బాధాకరం. ‘మన వయసు గురించి మన కంటే ఎదుటి వారికే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వయసు మళ్లడం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. అది రోజూ మనం అనుభవించే ఒక సహజమైన ప్రక్రియ. నిన్న 20ఏళ్ల వయసులో నిద్రపోతే… రేపటిì ఉదయాన్నే 45ఏళ్ల వ్యక్తిలా నిద్రలేవం కదా?’ అని అంది.
నిజంగానే…అబద్ధాలు ఆడను: టబు
- Advertisement -
RELATED ARTICLES


