Homeఅంతర్జాతీయంఅమెరికా ‘సామాజికి వాతావరణం’లో మార్పులు

అమెరికా ‘సామాజికి వాతావరణం’లో మార్పులు

- Advertisement -

జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్య
బెర్లిన్:
అగ్ర రాజ్యం అమెరికాపై జర్మన్ చాన్సలర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మునుపటి పరిస్థితులు లేవని, అక్కడ ‘సామాజిక వాతావరణం’లో చాలా మార్పులు సంభవించాయని జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో చదువుకు, ఉద్యోగాలకు వెళతామని తన పిల్లలు చెబితే, సరేనంటూ వారిని ప్రోత్సహించలేనని… ఆ దేశంలో ఉన్నపళంగా మారిన పరిస్థితులే ఇందుకు కారణం అన్నారు. ‘వాస్తవానికి నేను అమెరికాకు గొప్ప అభిమానిని. కానీ, ప్రస్తుతానికి ఆ అభిమానం పెరగడం లేదు’ అంటూ వర్జ్‌బర్గ్‌లోని క్యాథలిక్ కాంగ్రెస్ ప్యానెల్ చర్చల్లో ఆయన తెలిపారు. బాగా చదువుకున్న యువత ఏమి సాధించగలరనే ప్రశ్నకు అమెరికాలో ఏడాది కిందటిదాకా భిన్నమైన సమాధానాలు లభించేవన్నారు. నేటి అమెరికాలో ఉన్నత విద్యావంతులు ఉద్యోగం సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడ విద్య, ఉద్యోగాల్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. విదేశ విద్యార్థులు, ఉద్యోగుల తొలగింపు, వీసా వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ విధమైన వ్యాఖ్యల చేశారు.
హోర్మూజ్‌పై ట్రంప్‌తో ఏకీభవిస్తాను…
చైనా పర్యటన నుంచి వెనుదిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను ఫోనులో మాట్లాడినట్లు ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. ‘ఇరాన్ చర్చలకు వచ్చి, హోర్మూజ్ జలసంధి తెరవాల్సిందే’ అంటూ తామిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన ‘ఎక్స’ ద్వారా తెలిపారు. కేవలం ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆయన స్పందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు