మహారాష్ట్రలోని అమరావతి ట్రాఫిక్ పోలీసులకు ఏసీ జాకెట్లు
అమరావతి (ముంబై): మహరాష్ట్రలోని అమరావతి పోలీస్ యంత్రాంగం వినూత్న ఆలోచన చేసింది. ఎండ తీవ్రతను తట్టుకునేలా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ జాకెట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటిని ధరించి 46 డిగ్రీల ఎండలోనూ ట్రాఫిక్ పోలీసులు కూల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భానుడి భగభగలకు విరుగుడుగా అమరావతి పోలీసులు ఏసీ జాకెట్లు వాడుతున్నారు. తీవ్రమైన ఎండలో రోడ్లపై నిలబడి పనిచేయడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు వడదెబ్బ తగులుతోంది. దీంతో చాలా మంది సెలవులు పెడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏసీ జాకెట్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘ఎండలో నిలబడి పనిచేయడం చాలా కష్టంగా ఉండేది. చెమట్లు పట్టి శరీరం నిర్జలీకరణ ( డీ హైడ్రేషన్) చెంది కళ్లు తిరిగేవి. ఇప్ప్పుడు ఈ జాకెట్లు వేసుకోవడంతో లోపల చల్లని గాలి వస్తుంది. ఎండ అంతగా అనిపించడం లేదు’ అని జాకెట్ వేసుకుని విధులు నిర్వహిస్తోన్న పోలీస్ అన్నారు. కాగా ఈ జాకెట్ ఒక్కొక్కటి రూ. వేడు వేలు అవుతుందని పోలీస్ అధికారి తెలిపారు.
ఎండలో కూల్‌గా ట్రాఫిక్ విధులు
- Advertisement -


