Homeఅంతర్జాతీయంకెనాడాకు షాకిచ్చి ట్రంప్

కెనాడాకు షాకిచ్చి ట్రంప్

- Advertisement -


అమెరికా-కెనడా రక్షణ బంధం కటీఫ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. రెండో ప్రపంచయుద్ధం నుంచి కొనసాగుతోన్న రక్షణ బోర్డు నుంచి తాము వైదొలుగుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ఈసందర్భంగా రక్షణ వాగ్దానాలపై పురోగతి సాధించడంలో కెనడా విఫలమైందని నిందలు మోపింది. అమెరికా రక్షణశాఖ సహాయ కార్యదర్శి ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. 1940లో నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్, కెనడా ప్రధాని మెకెంజీ కింగ్ ఈ రక్షణమండలిని స్థాపించారు. దీన్ని ‘ఓగ్డెన్స్‌బర్గ’ ఒప్పందం అని కూడా పిలుస్తారు. ఈ రక్షణ మండలి నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ఎల్‌బ్రిడ్జ్ కోల్బీ తాజాగా ప్రకటించారు. ‘మాటల కన్నా సైనిక శక్తికి ప్రాధాన్యమిచ్చే బలమైన కెనడా మనందరికీ ప్రయోజనకరం. దురదృష్టవశాత్తూ… కెనడా తన రక్షణ వాగ్దానాలపై విశ్వసనీయమైన పురోగతిని సాధించడంలో విఫలమైంది. దీంతో శాశ్వత ఉమ్మడి రక్షణ మండలి ద్వారా లభించే ప్రయోజనాలను పునఃపరిశీలించాలని నిర్ణయించుకున్నాం. ఈ ఉద్దేశంతోనే మండలి నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నాం’ అని పేర్కొన్నారు.
ఉమ్మడి రక్షణ, భద్రత విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కెనడాపై విమర్శలు చేశారు. కాగా.. అమెరికా నిర్ణయంపై కెనడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కెనడా, ఇతర నాటో దేశాలు తమ సొంత సైన్యంపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయని, రక్షణ భారాన్ని అమెరికానే ఎక్కువగా మోస్తోందని చాలాకాలంగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. మరోవైపు అధిక సుంకాలు, ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీల మధ్య ఉన్న వివాదంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం నాటో దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు