తన కజిన్ కుటుంబం కోసం పోరాడి గెలిచా: ఇషాన్ కిషన్
చెన్నై: హోం టీమ్‌పై స్థానిక మైదానంలో విజయం సాధించింది సన్‌రైజర్స్ (ఎసఆర్‌హెచ్). ఈ ఐపీఎల్ సీజన్‌లో సోమవారం చెన్నైను ఓడించిన హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. చెపాక్ స్టేడియంలో మందకొడి పిచ్‌పై ఇషాన్ కిషన్ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్నందించాడు. ఈ కీలక ఇన్నింగ్స్ ఆడటం వెనుక ఓ భావోద్వేగభరిత ప్రేరణ ఉందన్నాడు ఇషాన్. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న తన కజిన్ కుటుంబం కోసం తాను పోరాడి గెలిచానని చెప్పాడు. చెన్నైతో మ్యాచ్ అనంతరం ఇషాన్ మాట్లాడుతూ…‘ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాదని వికెట్ కీపింగ్ చేస్తున్నప్ప్పుడే అర్థమైంది. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ బంతి ఎలా వస్తుందో తెలుసుకోగలిగా. ఛేదనలో చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండాలని అప్ప్పుడే నిర్ణయించుకున్నా. ఇలాంటి పిచ్‌పై సింగిల్స్ కూడా కష్టమే. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌తో ఎప్పటికప్ప్పుడు చర్చిస్తూ షాట్లు ఆడాం’ అని ఇషాన్ కిషన్ వివరించాడు. ‘ఈ మ్యాచ్ నాకు వ్యక్తిగతంగానూ కొంత ఎమోషనల్ మూమెంట్. ఇటీవల మా కజిన్ తన సోదరిని కోల్పోయాడు. అతడి కుటుంబానికి ఇది చాలా కష్టసమయం. ఆమె మరణం తర్వాత మా కజిన్ తన కుటుంబంతో కలిసి తొలిసారి నా మ్యాచ్ చూడటానికి వచ్చాడు. అతడి కోసం నేను గెలవాలనుకున్నా. అదే నా మోటివేషన్. ఆ కుటుంబం కోసం ఈ గేమ్‌ను ముగించాలనుకున్నా. వారు నా ఇన్నింగ్స్‌ను చూడటం చాలా ఆనందంగా అనిపించింది. వారి ఆశీర్వాదాల వల్లే నేను జట్టు కోసం ఏదైనా చేయగలను అని నమ్మాను. అది ఫలించి మేం ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం’ అని ఇషాన్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. టీ20 ప్రపంచకప్ సమయంలో ఇషాన్ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్ జట్టు
- Advertisement -


