Homeజాతీయంపీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న రూ.9,330 కోట్ల కార్మికుల సొమ్ము

పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న రూ.9,330 కోట్ల కార్మికుల సొమ్ము

- Advertisement -

నిరుపయోగంగా 31 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు

ఇండియా టుడే ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైన నిజాలు
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కోసం సరికొత్త ఃఈపీఎఫ్ స్కీమ్-2026ఃను నోటిఫై చేసి డిజిటల్ యుగానికి శ్రీకారం చుట్టింది. అయితే, మరోవైపు దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల నిరుపయోగ ఈపీఎఫ్ ఖాతాల్లో దాదాపు రూ.9,330 కోట్లకు పైగా కార్మికుల సొమ్ము క్లెయిమ్ చేయకుండా మూలుగుతోందన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.ఇండియా టుడే ప్రత్యేకంగా సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా పొందిన ఈ వివరాలు బయటకు వచ్చాయి.

1952 నాటి పాత పథకం స్థానంలో జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఈపీఎఫ్ స్కీమ్-2026, నిబంధనలను సరళతరం చేయడం, వ్యవస్థను డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది యాక్టివ్ చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సంస్కరణల నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ పొదుపు ఎంత పెద్ద మొత్తంలో వారికి చేరకుండా నిలిచిపోయిందో ఆర్టీఐ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అందించిన సమాచారం ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 నిరుపయోగ ఖాతాలు ఉన్నాయి. వీటిలో సుమారు రూ.9,330 కోట్లు క్లెయిమ్ చేయని నిల్వలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ, సమస్య తీవ్రత మాత్రం తగ్గలేదు. 2025 మార్చి 31 నాటికి 31.83 లక్షల ఖాతాల్లో రూ.10,181 కోట్లు ఉండగా, ఏడాది వ్యవధిలో నిరుపయోగ ఖాతాల సంఖ్య 92,000, క్లెయిమ్ చేయని మొత్తం రూ.851 కోట్లు తగ్గింది. అయితే, ఇప్పటికీ దాదాపు 31 లక్షల ఖాతాలు నిద్రాణంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.

రూ.9,330 కోట్లతో ఏం చేయవచ్చు?
ఈపీఎఫ్ ఖాతాల్లో మూలుగుతున్న ఈ భారీ మొత్తం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రభుత్వ పథకాలతో పోల్చి చూడాలి. 2016లో ప్రారంభించిన ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఃఉడాన్ః కోసం కేంద్రం ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ.10,169 కోట్లతో ఈ మొత్తం దాదాపు సమానం.కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై)కు కేటాయించిన నిధులకు ఇది దాదాపు సమానం.2014 ప్రభుత్వ అంచనా ప్రకారం ఒక ఐఐటీని ఏర్పాటు చేయడానికి రూ.1,750 కోట్లు ఖర్చవుతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2026 నాటికి దీని విలువ రూ.2,934 కోట్లు. అంటే, ఈపీఎఫ్ ఖాతాల్లోని డబ్బుతో మూడు కొత్త ఐఐటీలను నిర్మించి, ఇంకా రూ.500 కోట్లకు పైగా మిగుల్చుకోవచ్చు. ఈ పోలిక కేవలం ఉదాహరణ మాత్రమే అయినప్పటికీ, కార్మికుల సొమ్ము ఎంత భారీ స్థాయిలో నిలిచిపోయిందో స్పష్టం చేస్తోంది.

సమాచారం ఇవ్వని ఈపీఎఫ్ఓ
గత ఐదేళ్లుగా నిరుపయోగ ఖాతాల సంఖ్య, వాటిలోని మొత్తం వివరాలను ఃఇండియా టుడేః ఆర్టీఐ ద్వారా కోరింది. అయితే, ఈపీఎఫ్ఓ కేవలం 2025, 2026 సంవత్సరాల సమాచారాన్ని మాత్రమే అందించగలమని తెలిపింది. 2025-26లోనే ఃఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్ః (ఐఏసీ)ను ఏర్పాటు చేశామని, అంతకుముందు సంవత్సరాల సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది.

అంతేగాక, ఆధార్‌తో అనుసంధానమైన నిరుపయోగ ఖాతాలు, వాటిలోని మొత్తం, ఆటో-సెటిల్‌మెంట్ స్థితి వంటి వివరాలను వెల్లడించడానికి ఈపీఎఫ్ఓ నిరాకరించింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఇ) ప్రకారం, విశ్వసనీయ సంబంధం కింద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయలేమని తెలిపింది. రూ.5 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్న నిరుపయోగ ఖాతాల వివరాలు కోరగా, ఆ ఫార్మాట్‌లో డేటా నిర్వహించడం లేదని బదులిచ్చింది.మొత్తం మీద కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నప్పటికీ, కార్మికుల కష్టార్జితం వారికి చేరడంలో దశాబ్దాలుగా ఉన్న సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు