Homeజిల్లాలుఅనంతపురంపారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపకల్పన

పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపకల్పన

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ (అనంతపురం జిల్లా) : పారిశ్రామిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళిక రూపకల్పన చేయాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. తిరుపతిలో తాజ్ హోటల్ లో స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్, ఆర్థిక విశ్లేషణ 2047 సదస్సులో ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు ఉన్నత అధికారులు, ఏపీలోని వీసీ ల సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో జేఎన్టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు కలిశారు. అనంతరం సదస్సులో వీసీ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర, కొత్త ఆవిష్కరణలు, ఉత్పాదక భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థలో కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులను పాలుపంచుకుని.. కుటుంబం, పంచాయతీ, రాష్ట్రస్థాయి నుండి భారీ డేటాను సేకరించి.. రాష్ట్ర అభ్యున్నతకు తోడ్పాటునందించేందుకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయం (అనంతపురం) నిరంతరం సంసిద్ధంగా ముఖ్యమంత్రికి హామీని ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సమర్థవంతంగా ఉపయోగించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు