: ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు : “కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం గొప్ప భరోసా కల్పిస్తోంది అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల వాటాతో పనులు చేపట్టనున్నారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాప్తాడు ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులు, కూటమి నాయకులు, కూలీలతో కలిసి ఎమ్మెల్యే సునీత ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం మహిళా కూలీలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై 30 శాతం అదనపు భారం పడినప్పటికీ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూలీల ప్రయోజనాలకే పెద్దపీట వేశారని కొనియాడారు. పథకం అమలులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని, పనిచేసిన ప్రతి ఒక్కరికీ వేతనం పక్కాగా అందుతుందని స్పష్టం చేశారు. కూలీలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు పథక పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, ఏపీఓ సావిత్రి, డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేపకుంట సుధాకర్, సొసైటీ ఛైర్మన్ మరూరు గోపాల్, డిప్యూటీ ఎంపీడీఓలు అశోక్ బాబు, అచ్యుత్ బాబు, ఈసీ మురళీ, ఎంపీటీసీ జాఫర్, నాయకులు సాకే నారాయణస్వామి, గుజ్జల నారాయణస్వామి, బీరన్న, మాన్లుకోసే కేశవ, మోహన్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ తలారి శివ, గంగలకుంట శివ తదితరులు పాల్గొన్నారు.



