ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;;దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం రూరల్ మండలం పరిధిలోని కునుతూరు గ్రామంలో టీడీపీ నేతలు తో కలిసి పేదవారి సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు పింఛన్లు అందిస్తారో తెలిసేది కాదని.. ఇప్పుడు అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు నేరుగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పింఛన్లు క్రమం తప్పకుండా అందిస్తున్నామని.. 1వ తేది ఆదివారం వస్తే ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ జరుగుతోందన్నారు. తొలి రోజే 95శాతం మందికి పింఛన్లు అందుతున్నాయన్నారు. జగన్ రెడ్డి 10లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయాడన్నారు. సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అనుభవంతో రెండేళ్లలోనే గాడిలో పెట్టారని.. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచారన్నారు. ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తూ, విధులను సమకూర్స్తూ ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా తొలగించిన వాటిని కూడా పునరుద్ధరిస్తామని శ్రీరామ్ స్పష్టం చేశారు…
పింఛన్ల పంపిణీలో దేశంలో ఏపీ టాప్
- Advertisement -
RELATED ARTICLES


