రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి వైద్యశాలలో రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నర్సింలు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ బి సి రాయ్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.సి రాయి జననము, మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆరవాయితీగా వస్తుందని తెలిపారు. వారు మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రిగా సేవలను అందించడం జరిగిందన్నారు. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వైద్య వృత్తిని గౌరవిస్తూ వైద్యుల సేవలను గుర్తించుకోవాలని తెలిపారు. డాక్టర్ బి.సి రాయి స్ఫూర్తితో వైద్యవృత్తిని కొనసాగిస్తూ వృత్తికి పునర్కితం కావాలని వారు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.
ఘనంగా జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవం..
- Advertisement -
RELATED ARTICLES


