విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నందు టి శ్రీజ రాయల్ 95 శాతము , బీఎస్సీ బోటనీ నందు పి మధుశాలిని 93 శాతము మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి ప్రభంజనం సృష్టించారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నాడు కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను వారు మిఠాయిలు తినిపించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. తమ ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వరుసగా మూడవ సారి తమ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ టాపర్లుగా నిలవటం మా క్రమశిక్షణతో కూడిన విద్యకు నిదర్శనమని ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ,అధ్యాపక బృందానికి మా అభినందన శుభాకాంక్షలను తెలుపుతున్నామని వారు తెలిపారు . అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నందు అమృత సాయి 90 శాతము, మౌనిక 88 శతము, మేఘన86 శాతము, మాబుణ్ణి 86 శాతము శ్రీహర్ష 85 శాతము , బీఎస్సీ బోటనీ నందు ఓ ప్రత్యూష 88 శా తము, శ్రీలత 87 శాతము, జాహ్నవి ప్రియ 86 శాతము, జయ చంద్రిక 85 శాతము బీకాం కంప్యూటర్స్ నందు జి తనూజ 90 శాతము, జి పావని 85 శాతము బుషారా 85 శాతము, జ్యోతిక 85 శాతము మార్కులను సాధించారని తెలిపారు. అలాగే కళాశాల ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 91 శాతము గా నమోదు అయిందని వారు తెలిపారు. కళాశాల అకడమిక్ ఇంచార్జి కృష్ణయ్య మాట్లాడుతూ అద్భుత విజయాన్ని సాధించిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలను తెలుపుతూ మార్కులతో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనుగడ సాగించడం సాధ్యం అవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
3వ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయభేరి
- Advertisement -
RELATED ARTICLES


