Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశాము..

అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశాము..

- Advertisement -

ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, జిల్లా కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు జూన్ 22వ తేదీనే మండల పరిధిలోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు, పట్టణములోని పాఠశాలలకు పూర్తి దశలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై మాసాంతం లోపు పాఠ్యపుస్తకాలు వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. రూరల్, పట్టణం లోని 75 ప్రాథమిక పాటశాలల్లో 15,112 పుస్తకాలను, అదేవిధంగా యూపీ స్కూల్ అనగా ఆరవ తరగతి నుండి 8వ తరగతి వరకు గల 25 పాఠశాలల్లో 23,469 పాఠ్యపుస్తకాలు, 9వ, పదవ తరగతి గల 20 పాఠశాలల్లో 13,457 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొత్తం మీద పాత విద్యార్థులు తప్ప, కొత్తగా చేరిన వారికి ఇంకను ప్రభుత్వము నుంచి పాఠ్యపుస్తకాలు రాలేదని, ఇండెంట్ పెట్టడం జరిగిందని వారు స్పష్టం చేశారు. కావున తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్లు గమనించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు