Homeజిల్లాలుఅనంతపురంఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…బుధవారం వీక్లీ పరేడ్‌లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్‌ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ​శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక యోగా శిక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ​ఈ యోగా సెషన్‌లో ఏఆర్ సిబ్బంది కి అనుభవజ్ఞులైన యోగా నిపుణుల పర్యవేక్షణలో సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామం, మరియు ధ్యానం లపై అవగాహన కల్పించి, వారితో యోగాసనాలు చేయించడం జరిగిందన్నారు. ఒత్తిడి నివారణ: రోజువారీ విధుల్లో ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మరియు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు.
​ఆరోగ్య సంరక్షణ: సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం ద్వారా అధిగమించవచ్చని వివరించారు. ​పనితీరు మెరుగుదల: యోగా వల్ల పోలీస్ సిబ్బందిలో ఏకాగ్రత, క్రమశిక్షణ పెరిగి, వారి విధి నిర్వహణ మరింత మెరుగవుతుందని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు