Homeసినిమామెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

మెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

- Advertisement -

హైదరాబాద్: అగ్రహీరో మెగాస్టార్ కొత్త సినిమా షురూ అయింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం(నేడు) సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫుల్ జోష్‌తో కొత్త సినిమా ఆరంభమైంది. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా ‘మెగా 158’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా… చిరు కుమార్తె, నిర్మాత సుస్మిత కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. చిరు ఈ కార్యమ్రంలో కొత్త జోష్‌లో కనిపించారు. ప్రత్యేకమైన ఆనందాలు ఆయన ముఖంలో కినిపించాయి. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అనశ్వర రాజన్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆమె చిరుకు కుమార్తెగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత బాబీ`చిరు కలయికలో రూపొందనున్న రెండో చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు.
ఇది భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానుల కోసం పవర్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. ఈ సినిమా కోసం చిరు జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. కొత్త లుక్‌తో ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. జైలర్, డాకూమహారాజ్ వంటి చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి చిత్ర బృందం ప్రణాళికలు రూపొందిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు