తమని విలన్‌గా చిత్రీకరించడం తగదురష్యా ఐరాసతో మాకు పనిలేదుఇజ్రాయిల్
మాస్కో/ తెలఅవివ్: సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక నివేదిక వివాదాస్పదంగా మారింది. దీనిలో రష్యా, ఇజ్రాయెల్ దళాల పేర్లను చేర్చడంతో ఇప్ప్పుడు ఆ దేశాలు మండిపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల కిందట మొదలైన ఈ నివేదికలో తొలిసారి ఇజ్రాయిల్ పేరును చేర్చారు. పలస్తీనాలో ఆ దేశ దళాలు చేస్తున్న హింసకు ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంపై ఐరాసలోని రష్యా రాయబారి వెసెల్లీ నింబెంజియా తీవ్రంగా స్పందించారు. తమ దేశాన్ని విలన్‌గా చిత్రీకరించేలా నివేదికలో అసత్య ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్ ఈ నివేదికపై మాట్లాడుతూ… తమకు ఐరాస సెక్రటరీ జనరల్‌తో పనిలేదని అన్నారు. తమ దళాలను ఐసీస్, హమాస్ వంటి ముఠాల వలే చూపించారని మండిపడ్డారు.
ఐరాస బ్లాక్‌లిస్ట్‌లో…రష్యా, ఇజ్రాయిల్ దళాలు
- Advertisement -
RELATED ARTICLES


