Homeఆంధ్రప్రదేశ్త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ

త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ

- Advertisement -

గాలివాన బీభత్సం…అధికారులతో మంత్రి గొట్టిపాలి సమీక్ష
అమరావతి:
రాష్ట్రంలో పలు చోట్ల గరువారం రాత్రి నుంచి పలుచోట్ల వర్షం, ఈదురుగాలుల వల్ల వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయి. దీనితో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. వర్షం కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యమవుతోంని తెలిపారు. మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులను మంత్రి ఆదేశించారు. ఏ పనికి ఎంత సమయం పడుతుందో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని ఆదేశించారు. పజలకు ఏ సమస్య ఉన్నా 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. విజయవాడలో విద్యుత్ తీగ తెగిపడి హోంగార్డు మృతి చెందడం పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంగార్డు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఒకటి, రెండు గ్రామాలు మినహా విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నంలోపు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు