Homeజిల్లాలుఅనంతపురంహాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

- Advertisement -

కాలేజీ వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన

విశాలాంధ్ర – నార్పల..నార్పల మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విషాదంలో ముంచెత్తింది. మండల పరిధిలోని జంగమరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కురుబ రాజా కుమారుడు యశ్వంత్ కుమార్ (17) కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నాడు.గత రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని యశ్వంత్ మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కళాశాలకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కాలేజీ యాజమాన్యం వేధింపులు, ఒత్తిడులు భరించలేకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు.యశ్వంత్ మృతదేహాన్ని కళాశాల ఎదుట ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనకు దిగారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఘటన సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులను కాలేజీ గేటు దాటి లోపలికి అనుమతించకపోవడం వివాదానికి దారితీసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు