ఇరాన్‌తో ప్రతిపాదిత ఒప్పందానికి సుముఖత!
ట్రంప్ మాటలు నమ్మలేం: ఇరాన్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధపడితేగాని బోధపడదన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు తత్వం బోధపడుతున్నట్లుంది. ఇరాన్ కొట్టిన చిన్న దెడ్బలే అమెరికాకు గట్టిగా తగిలినట్లుంది. ఇరాన్‌తో కీలకమైన తాత్కాలిక ఒప్పందానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హోర్మూజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని ఎత్తివేయనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌తో కొలిక్కివచ్చిన తాత్కాలిక ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు శ్వేతసౌధం సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో ట్రంప్ శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అంతకుముందు- ‘ట్రూత్ సోషల’లో ఆయన ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఉపసంహరించుకుంటామని అందులో తెలిపారు. ఆ జలసంధిలో అమర్చిన మందుపాతరలను తెహ్రాన్ వెంటనే తొలగిస్తుందని చెప్పారు. అయితే, ఎన్నటికీ అణ్వస్త్రాలను పొందబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని పేర్కొన్నారు.
ట్రంప్ మాటలు నమ్మలేం: ఇరాన్
ప్రతిపాదిత ఒప్పందం గురించి ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో కొన్ని సత్యాలతో పాటు అసత్యాలూ ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. బేషరతుగా హోర్మూజ్‌ను తెరిచేందుకు తాము అంగీకరించినట్లు ఆయన చెప్పిన మాట అబద్ధమేనని పేర్కొంది. తమ పరిశీలనలో ఉన్న ఒప్పందంలో అలాంటి ప్రస్తావనే లేదని స్పష్టం చేసింది. తమ దేశంలో బుషెహర్ ప్రావిన్సులో అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని శుక్రవారం కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది.
హోర్మూజ్ దిగ్బంధనం ఎత్తివేస్తాం: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


