Homeజాతీయంచిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?..

చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?..

- Advertisement -

వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌పై విమ‌ర్శ‌లు!
వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్
గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు
వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్


ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. అయితే, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుత పోరాటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అయినప్పటికీ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 104) అద్భుత సెంచరీతో గుజరాత్ విజయం సాధించడంతో వైభవ్ పోరాటం వృథా అయింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ విఫలమైన దశలో క్రీజులోకి వచ్చిన వైభవ్, ఏమాత్రం బెదరకుండా పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. 204.26 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి జట్టు స్కోరును 214/6 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత ఎలిమినేటర్‌లోనూ 97 పరుగులతో రాణించి తన సత్తా చాటాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో వైభవ్‌ను కట్టడి చేసేందుకు గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ బౌలర్లు అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని ఃబాడీలైన్ః బౌలింగ్ వేశారు. ఈ విషయంపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఁ15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడానికి బాడీలైన్ బౌలింగ్ వేయడం నాకు నచ్చలేదు. అతను పెద్దవాళ్లతో ఆడుతున్నాడని నాకు తెలుసు, కానీ నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదుఁ అని పఠాన్ తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో చిన్న వయసు ఆటగాడిపై అంతటి దూకుడు అవసరమా అనే చర్చ మొదలైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు